పవన్ పుట్టినరోజు జరిపిన కోడాలి నాని…ఇపుడు మాట మార్చాడేంటి?

Monday, November 18th, 2019, 10:03:10 AM IST

టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు కొడాలి నాని. టీడీపీ నేతలను మాత్రమే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సైతం వదలడం లేదు. అయితే ప్రస్తుతం కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి వస్తున్నారు. అయితే ఇపుడు ఒకటి మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే జరిపిన కోడలి నాని ఇలా పవన్ పై విమర్శలు చేయడం పట్ల ఆయన అభిమానులు దూరమవుతున్నారు.

అధికారం లోకి వచ్చాక కొడాలి నాని విశ్వరూపం చూపిస్తున్నారు అని అన్నారు అయన అభిమానులు. అయితే ఒకప్పుడు ఈయన మీద అభిమానం ఉండేదని, పర్లేదు అనుకొనేవాడ్ని అని అన్నారు. అయితే ఇపుడు చేస్తున్న చర్యలకు ఇంకేం అభిమానం ఉంటుంది చెప్పండి. అదే విషయాన్నీ చిరంజీవి పాటలో తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం పైన, మరియు ఇసుక కొరత పైన ప్రజల తరపున స్పందిస్తూ గళమెత్తారు. అధికార పార్టీ సైతం స్పందించి ఇసుక కొరత ఈ నెలాఖరుకు ప్రజలందరికి అందుబాటులోకి వస్తుంది అని అన్నారు.