అరే! ఎన్టీఆర్ వ‌ద్ద‌న్నా మీది మీదికెళ్లారు!

Monday, June 11th, 2018, 01:21:21 PM IST

అభిమానుల‌ను సంతుష్టుల్ని చేసేందుకు ఇటీవ‌లి కాలంలో మ‌న స్టార్ హీరోలు ప‌డుతున్న పాట్లు మామూలుగా లేవు. దూరం పెడితే దూరం పెట్టేస్తున్నార‌ని కామెంట్లు చేస్తారు. ద‌గ్గ‌ర‌కు పిలిస్తే మీద ప‌డి చావ‌గొడ‌తారు. అస‌లు ఈ మాస్ ఫ్యాన్స్ ఉన్నారే.. మా గొప్ప‌ చెడ్డోళ్లు!! వ‌దిలేస్తే మీది మీదికొస్తారు.. ర‌చ్చ ర‌చ్చ చేస్తారు.

ఇదిగో ఇక్క‌డ ఎన్టీఆర్ ఇంటి ముందు స‌న్నివేశం అలానే క‌నిపిస్తోంది. నిన్నంతా బాల‌య్య బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ ప‌రిస‌రాల్లోని న‌ట‌సింహా ఇంటి ముందు నంద‌మూరి అభిమానులు బారులు తీరారు. బాల‌య్య‌ను క‌లిసేందుకు తంటాలు ప‌డ్డారు. అయితే అట్నుంచి అటే ఎన్టీఆర్ వ‌ద్ద‌కు ఈ అభిమానులు చేరుకుని నానా ర‌చ్చ చేశారు. ఓవైపు ఎన్టీఆర్ వారిస్తున్నా అక్క‌డ స‌న్నివేశం చూస్తుంటే మీది మీదికి వెళ్లిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇక‌పోతే అభిమానులు ఎంత ర్యాష్‌గా ఉన్నా తార‌క్ మాత్రం ప్ర‌శాంత చిత్తుడై అంద‌రికీ ఫోటోలు దిగే అవ‌కాశం ఇస్తున్నారు. ఇక గ‌త కొద్ది రోజులుగా తార‌క్ ఇంటి ప‌రిస‌రాల్లో ఇదే స‌న్నివేశం క‌నిపిస్తోందని అభిమానులే చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments