ఎన్టీఆర్ భీభత్సానికి… త్రివిక్రమ్ టానిక్! ఎలా ఉంటాదో?

Monday, September 25th, 2017, 10:35:20 AM IST


జై లవకుశ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరో వైపు ఎన్టీఆర్ కలెక్షన్స్ స్టామినా కూడా అమాంతం పెరిగిపోయింది. ఇంత వరకు ఎన్టీఆర్ స్టార్ హీరో అయిన కలెక్షన్స్ విషయంలో మహేశ్, పవన్ తో పోటీపడలేకపోతున్నాడనే టాక్ బలంగా వినిపించేది. ఇప్పుడు జై లవకుశ సినిమాతో ఇంకా ఎవరికైనా ఆ అభిప్రాయం ఉంటె వెంటనే తుదిచేయోచ్చు. ఎందుకంటే ఇప్పుడు జై లవకుశ సినిమాతో పవన్ కళ్యాణ్ ని సైతం కలెక్షన్స్ విషయంలో తారక్ క్రాస్ చేసేస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో తారక్ తో భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేసుకునే పనిలో నిర్మాతలు కూడా ఉన్నారు. మరో వైపు తారక్ కూడా తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఓవర్సీస్ లో తారక్ సినిమాలకి ఇక తిరుగు లేదని జై లవకుశ మరో సారి ప్రూవ్ చేసింది. ఇక మరో కొద్ది రోజుల్లో జై లవకుశ వేడి తగ్గిపోతుంది.

తారక్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటో ఇప్పటికే ఒక క్లేరిటి వచ్చేసింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలకి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తారక్ ఇప్పుడు జత కడుతున్నాడు. ఈ సినిమా కోసం తారక్ తన లుక్ కూడా కాస్తా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక త్రివిక్రమ్ కూడా ఇప్పటికే కథ మొత్తం రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్, తారక్ కోసం ఎలాంటి కథ తయారు చేసాడు అనేదాని మీద జూనియర్ ఫ్యాన్స్ ఆసక్తి ఉంది. ఇప్పటి వరకు త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా సరళి చూస్తే కాస్తా డిఫరెంట్ గా ఉంటాయి. హీరో ఎలివేషన్ కూడా కాస్తా కొత్తగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ నుంచి హీరో పాత్ర సృష్టించిన, ఆ పాత్రలో ఏదో ప్రత్యేకత మాత్రం ఉంటుంది. సొసైటీ అంటే లెక్కలేని తనం, తనని తాను ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఎంత వరకైనా వెళ్లేందుకు, అలాగే కుటుంబం కోసం ఎలాంటి ప్రమాదాలు అయిన ఎదుర్కొనెందుకు సిద్ధపడే పాత్రలు త్రివిక్రమ్ సృష్టి నుంచి వచ్చాయి. ఒక్క అఆ తప్ప అతను చేసిన సినిమాలన్నీ బలమైన హీరో పాత్ర ఉంటుంది. మరి జూనియర్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథ ఎంచుకున్నాడో తెలుసుకోవాలని అందరు ఆసక్తిగా ఉన్నారు. కథ ఏదైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ తారక్ చెబితే ఎలా ఉంటాయో అని ఇప్పటికే విజువల్ ఎసుకున్తున్నారు. మరి ఈ సినిమా తారక్ ఇమేజ్ ని ఎ విధంగా టర్న్ చేస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments