అమితాబ్ త్వరగా కోలుకోవాని కోరుతూ యజ్ఞం చేసిన అభిమానులు!

Wednesday, July 15th, 2020, 02:11:21 AM IST

కరోనా వైరస్ మహమ్మారి భారత దేశంలో భీభస్థం సృష్టిస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ సైతం కరోనా వైరస్ భారిన పడ్డారు. అయితే కరోనా వైరస్ భారీ నుండి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోలకతా లోని అమితాబ్ విగ్రహం తో ఉన్న ఆలయం లో యజ్ఞం నిర్వహించారు. అయితే ఈ యజ్ఞం ఆదివారం నుండి సోమవారం వరకు జరిగింది. రాత్రి కూడా యజ్ఞం జరగడం విశేషం. అయితే ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త వైరల్ గా మారింది.

అయితే అమితాబ్ బచ్చన్ కుటుంబీకులకు సైతం కరోనా వైరస్ సోకింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఆరాధ్య లకు సైతం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా వైరస్ సోకడం తో బాలీవుడ్ ప్రముఖులు సైతం త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజుకి వందల సంఖ్యలో బాధితులు మరణిస్తున్నారు. అయితే వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాల తో దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ కేసులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.