” ముస్లిం లని కండోమ్ లు వాడినట్టు వాడేస్తున్నారు “

Friday, January 27th, 2017, 12:54:35 PM IST

farhan-azmi
రాజకీయాల్లో ఉన్నవారు ఎలాంటి వ్యాఖ్య చేసినా అది ఇప్పుడు సంచలనం అవుతోంది. తమని తాము కూడా తిట్టుకోకూడదు అలా ఉంది మరి వ్యవహరం. మహారాష్ట్ర యూపీ అధికార పక్ష యువనేత మహారాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న అబూ ఆజ్మీ కుమారుడు ఫర్హాన్ ఆజ్మీ. ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తీరు చూస్తే.. ఎన్నికల్లో రాజకీయ లబ్థిని చేకూర్చటమే తప్పించి మరొకటి కాదన్నట్లుగా ఉంది. రకరకాల రాజకీయ పార్టీలు ముస్లిం ఓటర్లని కండోమ్ లాగా వాడుకుంటున్నాయి అనేది అతను చేసిన తీవ్ర వ్యాఖ్య.రాజకీయ ప్రయోజనం పొందటమే లక్ష్యంగాఅతగాడి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఫర్హాన్ ఆజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యలతో మొత్తం ముస్లిం జాతిని అవమానించినట్లుగా మండిపడుతున్నారు.