వైరల్ వీడియో: అప్పుల బాధతో కన్న కొడుకును ఉరి తీసిన తండ్రి..!

Monday, June 3rd, 2019, 05:32:39 PM IST

బెంగళూరులో హెచ్ఏఎల్‌ సమీపంలోని విభూతినగర్‌లో దారుణం చోటు చేసుకుంది. సురేష్ బాబు అనే 43 ఏళ్ల సేల్స్ ఎగ్జిక్యూటివ్ 12 ఏళ్ల తన కుమారుడిని ఫ్యాన్‌కు ఉరివేశాడు. సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సురేష్ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో అందరూ కలిసి చనిపోవాలని నిశ్చయించుకున్నారు. చిట్‌ఫండ్ వ్యాపారం పెట్టి అందులో నష్టాలను చవి చూసిన సురేశ్ కుటుంబం కొందరి ప్రైవేట్ వ్యక్తుల నుంచి వడ్డీకి డబ్బులు తీసుకున్నారని అయితే సకాలంలో వారు దాన్ని చెల్లించలేకపోవడం, అప్పుల వారు అప్పులు కట్టాలని ఇంటికి వచ్చి వేదిస్తుండడంతో ఆత్మహత్యలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.

అయితే వీరు అనుకున్న ప్లాన్‌లో భాగంగా ముందుగా సురేష్ బాబు తన భార్య కలిసి తన కుమారుడిని ఫ్యాన్‌కు ఉరి వేశారు. అయితే ఈ దృశ్యాన్ని సురేశ్ కూతురు తన తండ్రి ఫోన్ కెమెరాలో బంధించింది. ఈ వీడియోలో తన కొడుకు వరుణ్‌ను సురేష్‌ బలవంతంగా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేస్తున్నట్లుగా కనిపించింది. వరుణ్ గిలగిల కొట్టుకుంటుండగా భార్య గీతా, కూతురు ఆ దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆసమయంలో తన తమ్ముడిని వదిలేసి అందరం చనిపోదాం అని సురేష్ కూతురు బిగ్గరగా ఏడవటం వీడియోలో రికార్డు అయ్యింది. ఇక కూతురు రికార్డు చేస్తున్న వీడియోను గమనించిన గీతా వెంటనే ఫోనును తన చేతిలోనుంచి లాక్కొంది. అయితే ఆ తరువాత సురేశ్ భార్య గీత కూడ ఉరి వేసుకుని చనిపోయింది. ఇది మాత్రం వీడియోలో షూట్ కాలేదు. అయితే కళ్లముందే తమ్ముడు, తల్లి చనిపోతుండడం చూసి సురేశ్ కూతురు గట్టిగా ఆర్తనాదాలు పెట్టడంతో చుట్ట పక్కల వారు సురేశ్ ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే సురేశ్ కొడుకు, భార్య చనిపోయి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సురేశ్ ఇంటికి చేరుకుని ఆరా తీయగా సురేశ్ మాత్రం తన భార్య కొడుకును చంపి, తాను ఉరేసుకుందని చెప్పడు. అయితే కొద్ది సేపటి తరువాత అసలు వాస్తవాలు భయటపడ్దాయి. అయితే సురేశ్ కూతురు తీసిన వీడియో కూదా పోలీసులకు దొరకడంతో అందులో సురేశ్ బలవంతంగా తన కొడుకును ఉరి తీస్తూ కనిపించడంతో పఒలీసులు ఈయనపై కేసు నమొదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్‌లు కూడా ఎంత అప్పులు ఉంటే మాత్రం కన్న కొడుకును తన చేతులతోనే ఎలా ఉరి తీయాలనిపించింది అంటూ సురేశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.