తాప్సీకి అలా పంచ్ ప‌డింది!

Monday, October 1st, 2018, 03:10:47 PM IST

గ‌త కొంత‌కాలంగా ముంబై ప‌రిశ్ర‌మ‌లో తాప్సీ పేరు మార్మోగిపోతోంది. రీసెంట్‌గానే ముల్క్‌, మ‌న్మార్జియాన్ చిత్రాల‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. తాను ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాకి త‌నే ప్ల‌స్ అవుతోంది. ఆ క్ర‌మంలోనే అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలోని ఓ క్రేజీ సీక్వెల్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా దానిని తృణ‌ప్రాయంగా వ‌దులుకోవాల్సి వ‌చ్చిందిట‌.

అడ్వాన్స్ ఇస్తా అందుకో అంటే.. తూచ్ పొమ్మందిట‌. అస‌లు కార‌ణ‌మేంటి అంటే తాప్సీ ఇప్ప‌టికిప్పుడు క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది. బ‌ద్లా అండ్ త‌డ్కా చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అందుకే ఈ సినిమాకి సంత‌కం చేయ‌లేన‌ని చెప్పేసిందిట‌. దీంతో అనురాగ్ ఆ ప్లేస్‌లో దంగ‌ల్ బ్యూటీ ఫాతిమా స‌నా షేక్‌ని ఖాయం చేసుకున్నాడ‌ట‌. తాజా సీక్వెల్ లో రాజ్‌కుమార్ రావ్‌, ప‌రిణీతి చోప్రా, సైఫ్ ఖాన్‌, అభిషేక్ బ‌చ్చ‌న్, ఇషాన్ ఖ‌త్త‌ర్, సోనాక్షి సిన్హా లాంటి స్టార్లు న‌టిస్తున్నారు. ఇక‌పోతే ఫాతిమా ప్ర‌స్తుతం థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి క్రేజీ చిత్రంలో న‌టిస్తూ వేడి పెంచిన సంగ‌తి తెలిసిందే.