ఫోటో టాక్ : హాట్ హాట్ గా దంగల్ భామ చీరకట్టు..నీచమైన కామెంట్లు..!

Friday, November 10th, 2017, 01:15:50 PM IST

🙂 📸 @arjunkamath87 💄 @dsimrock 💇🏻 @nakitadsouza 💃 @nekkosha thank you nekko😘😘

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

దంగల్ లో గీతఫోగట్ గా నటించి మెప్పించిన ఫాతిమా సనా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తోంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. కాగా ఫాతిమా సన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ ల విషయం తరచుగా వివాదం రాజుకుంటోంది. ఆ మధ్యన రంజాన్ నెల జరుగుతున్న సమయంలో బీచ్ లో బికినీ ధరించిన ఫొటోకు ఫోజు ఇచ్చింది. ఆమెకు పెద్ద ఎత్తున ముస్లింల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.

విమర్శలు ఎక్కువవుతున్న కొద్ది ఫాతిమా జోరు పెంచుతోంది. తాజాగా అందమైన చీరలో అందాలన్నీ ఎక్స్పోజ్ అయ్యేలా ఫోజు ఇచ్చింది. దీనితో మరో మారు ఆమెపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటె మరి కొందరు హద్దులు దాటుతూ నీచమైన కామెంట్లు పెడుతున్నారు. నీవు నీపేరు మతం మార్చుకో, ఆ తరువాత ఏం చేయాలనుకుంటే అది చేయి అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ దారుణంగా వ్యాఖ్యానిస్తూ నీవు అశ్లీల చిత్రాల్లో నటిస్తే బావుంటుంది అని కామెంట్ పెట్టాడు.

Comments