డోంట్ మిస్ : భారత ఐటీ కంపెనీలకు హెచ్-1బి వీసా మరింత కఠినతరం…కారణం తెలుసా?

Tuesday, November 12th, 2019, 10:00:14 AM IST

ప్రస్తుతం తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా భారతదేశంలో చాల మంది ప్రజలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అమెరికా హెచ్-1బి వీసా కోసం ప్రయత్నిస్తూ వుంటారు. అయితే అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తాజా నివేదిక ప్రకారం భారత్ నుండి ఎక్కువగా హెచ్-1బి వీసా కి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఐటీ కంపెనీలకు ఈ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాదని తెలుస్తుంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం కొన్ని భారత్ కి చెందిన ఐటీ కంపెనీలను హెచ్-1బి వీసా రాకుండా తొలగించినట్లు సమాచారం. తొలగించిన వాటిలో అజిమెట్రీ ఇన్ కార్పొరేషన్, బుల్ మెన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇన్ కార్పొరేషన్, బిజినెస్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇన్ కార్పొరేషన్, నెటేజ్, కెవిన్ చాంబర్స్, ఇ- యాప్పైర్ ఐటీ ఎల్ఎల్సి లాంటి కొన్ని కంపెనీలను తొలగించినట్లు సమాచారం.

అయితే కొత్తగా అప్లై చేసుకొనే వారిలో భారతదేశం నుండే అధిక దరఖాస్తులు రావడం, అంతే కాకుండా యూఎస్సిఐయస్ ప్రమాణాలను మార్చుకోవడం తో వీసా చాల కష్టతరంగా మారింది. ఆ కంపెనీ ల వీసా తిరస్కరణకు కూడా అదే కారణం అని తెలుస్తుంది. అయితే గత మూడేళ్ళలో పోలిస్తే హెచ్-1బి వీసాలు ఎక్కువగా తిరస్కరణకు గురి అవుతున్నాయి. ఈ తిరస్కరణ 2015 ఆర్థిక సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం లో మూడు రేట్లుపెరిగాయని తెలుస్తుంది.