ఫిదా బ్యూటీ మ‌ళ్లీ హీరోతో లొల్లి!

Wednesday, July 25th, 2018, 09:12:07 PM IST


ప్రేమ‌మ్‌, ఫిదా వంటి చిత్రాల‌తో సాయిప‌ల్ల‌వి రేంజు స్కైని ట‌చ్ చేసింది. తాను ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాకి త‌నే పెద్ద అస్సెట్ అన్న టాక్ న‌డుస్తోంది. ఆ క్ర‌మంలోనే సాయి ప‌ల్ల‌విని గౌర‌వించి మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క‌థ‌లు అల్లుకుంటున్నారు. పాత్ర‌ల్ని క్రియేట్ చేస్తున్నారు. అంత ఉంది కాబ‌ట్టే ఈ అమ్మ‌డు ఎంతో యారొగెంట్‌గా ఉంటుందా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ యూత్‌లో సాగుతోంది.

ఇదివ‌ర‌కూ నిర్మాత దిల్‌రాజుతోనే గొడ‌వ పెట్టుకుంద‌ని, కెరీర్ ఆరంభ‌మే టెంప‌రిత‌నం చూపించింద‌ని మాట్లాడుకున్నారు. ఇటీవ‌ల క‌ణం రిలీజ్ సంద‌ర్భంలో హీరో నాగ‌శౌర్య‌తో సాయి ప‌ల్ల‌వి గొడ‌వ గురించి చ‌ర్చ సాగింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స‌న్నివేశం త‌లెత్తింద‌న్న చ‌ర్చ సాగింది. అదంతా పాత క‌థే అనుకుంటే, ఇప్పుడు వేరొక హీరోతోనూ ఈ అమ్మ‌డు గొడ‌వ‌ప‌డిందిట‌. త‌న కోస్టార్ .. ప‌డిప‌డి లేచే మ‌న‌సు హీరో శ‌ర్వానంద్‌తో ఈ అమ్మ‌డు గొడ‌వ పెట్టుకుంద‌ని, త‌న యాటిట్యూడ్‌ న‌చ్చ‌క అత‌డు హ‌ర్ట‌య్యాడ‌ని మాట్లాడుకుంటున్నారు. ఎక్క‌డ తేడా కొట్టిందో మొత్తానికి శ‌ర్వా లాంటి సాఫ్ట్ క్యారెక్ట‌ర్ ఉన్న హీరోనే హ‌ర్ట్ చేసిందంటే అస‌లేమైంద‌బ్బా! అంటూ ఫిలింన‌గ‌ర్ జ‌నం చెవులు కొరుక్కుంటున్నారు. అస‌లింత‌కీ గొడ‌వేంటో సినిమా రిలీజ్ ప్ర‌మోష‌న్స్‌లో అయినా తేల్తుందేమో? ఇంత‌కీ శ‌ర్వా ఈ అమ్మ‌డితో మాట్లాడుతున్నాడా? లేడా? అన్న‌ది తేలాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments