భూమా(X) శిల్పా: 400 కోట్ల స‌వాల్‌!!

Wednesday, November 16th, 2016, 08:20:28 PM IST

buma-silpha
క‌ర్నూల్‌ స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌తో అట్టుడికిపోతోంది. వైరి వ‌ర్గాల మ‌ధ్య వాడి వేడి అయిన మాట‌ల‌తో ర‌గిలిపోతోంది. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌లుగా పేరున్న భూమా నాగిరెడ్డి , శిల్పా మోహ‌న్‌రెడ్డి మ‌ధ్య వైరం గురించి ప్ర‌పంచానికి తెలిసిందే. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వీలున్న‌ప్పుడ‌ల్లా మాట‌ల తూటాలు పేల్తూనే ఉన్నాయి. అయితే అది కాస్త శ్రుతిమించ‌డం తేదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడుకు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింద‌ని తేదేపా వ‌ర్గాలే ముచ్చ‌టించుకుంటున్నాయి. ఏమాత్రం ఛాన్స్ దొరికినా ప్ర‌త్య‌ర్థిపై విరుచుకుప‌డుతూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు ఆ ఇద్ద‌రు నేతలు.

“ఉప్పు ప‌ప్పులు అమ్ముకునే నీకెందుకు రాజ‌కీయం?“ అని భూమా నాగిరెడ్డి శిల్పా మోహ‌న్‌రెడ్డిని ఉద్ధేశించి కామెంట్ చేస్తే అందుకు ప్ర‌తిగా కౌంట‌ర్ వేస్తూ శిల్పా ఏమ‌న్నారంటే.. “400 కోట్లను తెచ్చి నంద్యాలను అభివృద్ధి చేస్తానన్నావ్‌. ఏదీ ద‌మ్ముంటే చేసి చూపించు“ అంటూ ప్ర‌తిస‌వాల్ విసిరారు. ప్ర‌జా స‌మస్య‌ల విష‌యంలో కొట్టుకుందాం రా! అంటూ సూటిగా స‌వాల్ విసిరారు శిల్పా. దీంతో ఆ ఇద్ద‌రి వైరం బాబుకు బొప్పి క‌ట్టించేస్తోంద‌ని… నంద్యాల‌లో తేదేపా ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు.