కోల్డ్‌వార్‌: సోము వీర్రాజు వ‌ర్సెస్ ఆకుల!!

Monday, November 21st, 2016, 04:42:31 PM IST

mlc-somu-verraju-mla-aakula
ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ‌ర్సెస్ రాజ‌మండ్రి అర్బ‌న్ ఎమ్మెల్యే ఆకులు స‌త్య‌నారాయ‌ణ‌..!! .. ప్ర‌స్తుతం బీజేపీని క‌ల‌వ‌ర‌పెడుతున్న ఇష్యూ ఇది. తూ.గో జిల్లాకు చెందిన ఆ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పార్టీకి చేటు తెస్తున్నాయ‌ని ఇన్న‌ర్‌గా చ‌ర్చ సాగుతోంది. ప్ర‌త్యేక హోదా లో ఏపీకి అన్యాయం చేసిన భాజ‌పా అంటే ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో ఏహ్య‌భావం ఉంది. ఇలాంటి టైమ్‌లో పార్టీ నేత‌ల కుమ్ములాట‌లు పెద్ద చేటు తెస్తాయ‌ని అధిష్ఠానం వ‌ర‌కూ ఫిర్యాదులు అందాయ‌ని చెబుతున్నారు.

రాజమండ్రి బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఎంపిక విషయంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా త‌లెత్తిన విభేధాలు తారాస్థాయికి చేరాయి. ప్ర‌స్తుతం నువ్వా? నేనా? అంటూ తేల్చుకునే వ‌ర‌కూ సీన్ వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఇదివ‌ర‌కు ఆకుల సత్యనారాయణ అనుచరుడు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ గా కొన‌సాగారు. అయితే మ‌ధ్య‌లో వీర్రాజు ఎంట్రీ ఇచ్చి త‌న వ‌ర్గానికి ఆ ప‌ద‌వి ద‌క్కేలా చేశారుట‌. ఇదంతా సోము కావాల‌నే చేస్తున్నార‌ని స‌త్య‌నారాయ‌ణ వ‌ర్గం భావిస్తోంది. ప్ర‌స్తుతం భాజ‌పాలో ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎమ్మెల్సీ కోల్డ్‌వార్ ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.