బిట్ కాయిన్ స్కామ్ లో సినిమా తారలు ?

Thursday, June 7th, 2018, 04:19:30 PM IST

గత కొన్ని రోజుల క్రితం దేశాన్ని ఒక ఊపు ఊపేసిన బిట్ కాయిన్ స్కాం గురించి అందరికి తెలిసిందే. ఈ స్కామ్ లో బడా రాజకీయ వేత్తలనుండి .. చిన్న చితక వ్యాపారుల వరకు ఉన్నట్టు తెలిసింది. అందులో ముక్యంగా సినిమా తారలు ఉన్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పెద్ద దుమారమే రేగుతుంది. ఈ రాకెట్ లో ప్రధాన నిందితుడు అమిత్ భారత్వజ్ తో పలువురు హీరోలు, హీరోయిన్స్ కు, అలాగే దర్శక నిర్మాతలకు లింకులు ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే చాల సీరియస్ గా విచారణ జరుగుతుంది. శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా ని పోలీసులు దాదాపు 8 గంటల పాటు విచారించారు. దాంతో పాటు సన్నీ లియోన్, ఆర్తి చాబ్రియా, ప్రాచి దేశాయ్,కరిష్మా తన్న, జరీన్ ఖాన్, నేహా ధూపియా, హుమా ఖురేషి, నర్గిస్ ఫక్రి, శిల్ప శెట్టి ల పేర్లు బయటికి వచ్చాయి. దాంతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దిశగా ఆరాలు తీస్తున్నారు. ఈ బిట్ కాయిన్ వ్యవహారం మూలాలు చైనా లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ బిట్ కాయిన్ వ్యవహారం పై అటు కోలీవుడ్,ఇటు టాలీవుడ్ సెలబ్రిటీ లు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. మరి దీనిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టు టాక్.

  •  
  •  
  •  
  •  

Comments