సినీ పరిశ్రమ అంటే ఆ నాలుగు కుటుంబాలేనా : పీవోడబ్ల్యూ నేత సంధ్య

Monday, April 23rd, 2018, 01:14:08 PM IST

ఇప్పటికే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయమై తీవ్ర దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో సామజిక కార్యకర్త అయిన సంధ్య టాలీవుడ్ పరిశ్రమపై విమర్శలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు కుటుంబాల మాఫియా నడుస్తోందని పీవోడబ్ల్యూ నేత సంధ్య ఆరోపించారు. కొత్తవాళ్లు పరిశ్రమలోకి రాకుండా అణచివేస్తున్నారని మండిపడ్డారు. చిన్న సినిమాలకు థియేటర్లు కూడా దొరకకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని, కేవలం పెద్దసినిమాలకు మాత్రమే థియేటర్ లు దొరికేలా చేస్తున్నారని చెప్పారు.

పెద్ద పెద్ద స్టార్ల కు సంబంధించిన సినిమాలు మాత్రమే థియేటర్లో ఆడేలా చేస్తున్నారని విమర్శించారు. అలానే చిన్న సినిమాలు సక్సెస్ అయినా, నెగెటివ్ రివ్యూలు రాయిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలో ఆడవారిపై జరుగుతున్న లైంగిక దోపిడీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కమిట్ మెంట్ కావాలని అడిగేవారిని చెప్పుతో కొట్టాలంటూ సినిమా పెద్దలే పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నా, పక్క రాష్ట్రాల నుంచి విలన్లను తీసుకొస్తున్నారని కోట శ్రీనివాసరావు ఎన్నోసార్లు బాధను వ్యక్తం చేశారని ఆమె గుర్తు చేశారు.

ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి మరి ఏ ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమలలో లేదని, మన తెలుగువారంటే మనకే ఎందుకు అంత చులకనని ఆమె అన్నారు. ఇకనైనా సినీపెద్దలు శ్రద్ధ తీసుకుని ఆ నాలుగు కుటుంబలా ఆధిపత్యానికి అడ్డుకట్టవేసి, థియేటర్లు అందరికి అందుబాటులోకి తీసుకురావాలని, అలానే తెలుగు అమ్మాయిలకు కూడా సినిమాల్లో అవకాశాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేసారు…..

  •  
  •  
  •  
  •  

Comments