ఫిలింఫేర్ 2018 .. నిజాయితీ ఎంత‌?

Wednesday, June 6th, 2018, 02:04:19 AM IST

ప్ర‌తియేటా పిలింఫేర్ అవార్డ్స్ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది రిలీజై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ప‌లు చిత్రాలు ఈసారి అవార్డుల కేట‌గిరీలో పోటీప‌డుతున్నాయి. జూన్ 16న హైద‌రాబాద్‌లో 65వ ఫిలింఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ – నోవాటెల్‌లో జ‌రగ‌నుంది. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ సినిమాల‌కు పుర‌స్కారాలు అంద‌జేస్తారు. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ క‌థానాయ‌కుడు, ఉత్త‌మ క‌థానాయిక స‌హా ప‌లు కీల‌క కేటగిరీలకు పుర‌స్కారాలు ప్ర‌దానం చేయనున్నారు.

ఈసారి ఉత్త‌మ సినిమా కేట‌గిరీలో అర్జున్‌రెడ్డి, బాహుబ‌లి 2, ఫిదా, గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి, శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాలు పోటీప‌డుతున్నాయి. ఈ ఐదు చిత్రాల్లో ఏది ఉత్త‌మ సినిమా అన్న‌ది ఫిలింఫేర్ క‌మిటీ తేల్చాల్సి ఉంది. ఇక‌ ఉత్త‌మ క‌థానాయ‌కుడు కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవి(ఖైద‌నంబ‌ర్ 150), న‌ట‌సింహా బాల‌కృష్ణ (గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌(జై ల‌వ‌కుశ‌), ప్ర‌భాస్‌(బాహుబ‌లి2), వెంక‌టేష్ (గురు), విజ‌య్ దేవ‌ర‌కొండ (అర్జున్‌రెడ్డి) త‌దిత‌రులు పోటీప‌డుతున్నారు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కేటగిరీలో క్రిష్‌(గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి), ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి(బాహుబ‌లి 2), సందీప్‌రెడ్డి వంగా(అర్జున్‌రెడ్డి), సంక‌ల్ప్ రెడ్డి (ఘాజి), స‌తీష్ వేగేష్న‌(శ‌త‌మానం భ‌వ‌తి), శేఖ‌ర్ క‌మ్ముల (ఫిదా) పోటీలో నిలిచారు. ఉత్త‌మ క‌థానాయిక కేట‌గిరీలో అనుష్క శెట్టి (బాహుబ‌లి 2), నివేధ థామ‌స్ (నిన్ను కోరి), ర‌కుల్ ప్రీత్ సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం), రితిక సింగ్ (గురు), సాయి ప‌ల్ల‌వి (ఫిదా) …. పోటీప‌డుతున్నారు. ఉత్తమ స‌హాయ‌న‌టి కేట‌గిరీలో భూమిక (ఎంసిఏ), కేథ‌రిన్ థ్రెసా (నేనే రాజు నేనే మంత్రి), జ‌య‌సుధ (శ‌త‌మానం భ‌వ‌తి), ర‌మ్య‌కృష్ణ (బాహుబ‌లి -2), శ‌ర‌ణ్య ప్ర‌దీప్ (ఫిదా) .. పోటీ ప‌డుతున్నారు. ఖైదీనంబ‌ర్ 150, బాహుబ‌లి2, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, అర్జున్‌రెడ్డి చిత్రాలు ధీటుగా పోటీప‌డుతున్నాయి. విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌కుండా నిజాయితీగా అర్హుల‌కు ఈ పుర‌స్కారాలు అందాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.