మహేష్ – బన్నీల మధ్య డీల్ కుదిరింది ?

Thursday, February 22nd, 2018, 09:23:32 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. సరిగ్గా అదే రోజున .. ఇటు అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా విడుదలను ప్రకటించాడు. ఒకేరోజున రెండు భారీ సినిమాలు విడుదల విషయంలో క్లాషెస్ రావడం పరిశ్రమ వార్తలను టెన్షన్ పెడుతున్నాయి. ఈ రెండే సినిమాలు అనుకుంటే .. సందట్లో సడేమియా లా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా కూడా ఏప్రిల్ 27న విడుదల అవుతుండడంతో ఈ సమస్య ఇంకాస్త పెద్దదైంది. దాంతో పలువురు పెద్దలు ఈ సినిమాల మధ్య వచ్చే క్లాషెస్ విషయంపై ఫోకస్ పెట్టారు. దిల్ రాజు, నాగబాబు, కె ఎల్ నారాయణ లు కలిసి .. డివివి దానయ్య .. బన్నీ వాసు, లగడపాటి శ్రీధర్ లతో చర్చించి ఫైనల్ గా సెటిల్మెంట్ చేసారు. ఏప్రిల్ 20 న మహేష్ భరత్ అనే నేను .. వస్తుండగా .. మే 4న అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య విడుదల కన్ఫర్మ్ చేసారు. ఎప్పటిలాగే కాలా సినిమా ఏప్రిల్ 27న విడుదల అవుతుంది. మొత్తానికి బన్నీ- మహేష్ ల వ్యవహారం సెటిల్ అయినట్టే !!