కోడెల మృతిపై ఫైనల్ స్టేట్మెంట్

Tuesday, September 17th, 2019, 07:33:11 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న చనిపోయిన విషయం అందరికి తెలిసిందే , అయితే ఆయన మరణం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన గుండెపోటుతో చనిపోయారా..? ఆత్మహత్య చేసుకొని చనిపోయారా..? లేక ఇంకా ఏమైనా జరిగిందా అనే దానిపై భిన్న విధానాలు వినవచ్చాయి. కొందరేమో ఆయన కొడుకే కోడెలను చంపేసి, ఆ తర్వాత ఉరిగా చిత్రీకరించారని కూడా మాట్లాడటం జరిగింది..

అయితే దీనిపై పోలీసులు తమ వివరణ ఇచ్చారు. కోడెల శివప్రసాద్ ది ఆత్మహత్య గా వారు నిర్దారించారు. ఆయన ఇంట్లోనే మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఉరేసుకున్నాడు, పరిస్థితిని గుర్తించి హాస్పెటల్ కి తీసుకోని వెళ్లిన తర్వాత వెంటిలేటర్ మీద చికిత్స అందించిన కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీనితో ఆయన చనిపోవటం జరిగింది. అంతే తప్ప ఇందులో మరో కోసం ఏమి లేదని తేల్చిచెప్పారు. దీనితో ఆయన మృతిపై ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి.

ఇక కోడెల కొడుకు మీద వస్తున్నా ఆరోపణలు మరి దారుణంగా ఉన్నాయి. నిజానికి ఆయన కొడుకు ప్రస్తుతం కెన్యాలో ఉన్నాడు. అక్కడి నుండి బయలుదేరి మంగవరం ఉదయం ముంబై చేరుకొని, అటు నుండి హైదరాబాద్ మీదగా నరసారావుపేట చేరుకుంటాడు. ఎక్కడో కెన్యాలో ఉన్న అతని కొడుకు హాస్పెటల్ కి రాలేదని, ఆదివారం రోజు రాత్రి కోడెలతో గొడవ పెట్టుకున్నాడని కొన్ని మీడియా సంస్థలు చెప్పకొచ్చాయి. అవి పూర్తిగా అవాస్తవమే, కేసును తప్పు తోవ పట్టించటానికి కొన్ని మీడియా వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారం.