భీమవరంలో తన ఓటమిపై జనసేనాని సంచలన కామెంట్స్.!

Sunday, June 9th, 2019, 01:14:35 AM IST

ఇక ఎట్టకేలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన గళాన్ని విప్పారు.ఫలితాల అనంతరం కొన్నాళ్ళు మౌనంగా ఉన్న జనసేనాని గత కొన్ని రోజుల నుంచి సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు.ఇన్నాళ్లు పెద్దగా నోరు మెదపని పవన్ మరో సారి పార్టీ శ్రేణులు అంతటికీ ఒక సరికొత్త ఉత్సాహాన్ని అందించారు.మామూలుగానే పవన్ ఏ రేంజ్ లో తన స్పీచ్ ఇస్తారో అందరికీ తెలుసు.మళ్ళీ ఇన్నాళ్లకు ఓటమిని అధిగమించి అదే తరహా స్పీచ్ ను ఇచ్చి జనసేన శ్రేణుల్లో జోష్ నింపారని అభిమానులు అంటున్నారు.తాను అన్నిటికి సిద్ధపడే ఎన్నో ఏళ్ళు ఆలోచించి పార్టీ పెట్టానని,తన జీవితం ఇక నుంచి కేవలం రాజకీయాలకు మాత్రమే అంకితమని కూడా స్పష్టం చేసారు.

ఒక్క ఓటమితో తన దగ్గరకి వచ్చిన వారిలో ఎవరు ఎలాంటి వారో తెలిసేలా చేసింది అని కూడా తెలిపారు.తన ఓటమి వల్ల ఎవ్వరు తనని వదిలి వెళ్లినా సరే తనతో కడ శ్వాస వరకు నిలిచింది మీరే అని అభిమానులతో అన్నారు.తాను మొదట్లో పది మందితో మొదలయ్యి ఇప్పుడు ఎన్ని లక్షల మంది తోడయ్యారని తనని నమ్మి ఓటేసిన ప్రతీ ఒక్కరికీ తన చేతులు జోడించి నమస్కారిస్తున్నాని తెలిపి తన శవాన్ని నలుగురు వారి భుజాలపై మోసేంత వరకు జనసేన పార్టీని లాక్కొస్తానని తెలిపారు.రెండు చోట్లా తన ఓటమిపై సమీక్షా సమావేశాల్లో చర్చించగా తనకి చాలా విషయాలు తెలిసాయని,నా ఒక్కడి అడుగు అసెంబ్లీలో పడకుండా చెయ్యాలని కేవలం ఒక్క భీమవరంలో మాత్రమే దాదాపు 155 కోట్లు ఖర్చు పెట్టారని ఇంతకన్నా గొప్ప విజయం ఏం కావాలని సంచలన కామెంట్స్ చేసారు.