మొదటిసారి వైసీపీలోని భయాన్ని బయటపెట్టించిన జనసేనాని.!

Saturday, August 24th, 2019, 07:19:55 PM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో ఉంటే రెండు పార్టీలు మాత్రమే ఉండాలి కాదని వేరే పార్టీలు మధ్యలోకి వస్తే వాటిని ఎలా అయినా తొక్కుతారు అన్నదానికి ఉదాహరణగా వైసీపీ చేసిన నిర్వాకంనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.మొదటి నుంచి ఏపీలోని సరికొత్తగా పార్టీతో ఎంట్రీ ఇచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను తొక్కడానికి మన రాజకీయ పార్టీలు ఎంతలా దిగజారిపోయాయి అంటే ఆఖరుకు పవన్ తల్లిని కూడా దూషించేంత స్థాయికి వెళ్లిపోయారు.

ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు నడిపితున్నారో కూడా అందరికి తెలుసు.అయితే ఇలాగే ఎన్నో ప్రచారాలు అటు టీడీపీ కూడా జనసేనపై గట్టిగానే చేసింది.పవన్ తమతో కలిసే ఉన్నాడు అన్న ఒక్క మాట చెప్పేసి ఊరుకోగా అది మాత్రం జనసేన పార్టీకు కోలుకోలేని దెబ్బ కొట్టేసింది.ఈ ఒక్క మాటతో వైసీపీ వారు పవన్ చంద్రబాబు ఆడించే పైడ్ ఆర్టిస్ట్ అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఏపీ ప్రజలను నమ్మించేసారు.ఎన్నికలు సమయంలో పవన్ ఎన్ని సార్లో తనకు టీడీపీతో సంబంధం లేదని చెప్పి చెప్పి విసుగొచ్చేసి చెప్పడమే మానేశారు.

ఇది కూడా పవన్ కు మైనస్ అయ్యిపోయింది.దీనిని బట్టే పవన్ వల్ల వైసీపీకు ఎంతటి నష్టం వస్తుందో వారికి ముందే అర్ధం అయ్యి ఉండొచ్చు.దానికి వారు భయమని పేరు పెట్టుకున్నారో లేక మరేమన్నా పెట్టుకున్నారో కానీ పవన్ అడుగు మాత్రం అసెంబ్లీలో పెట్టనివ్వకుండా వందలాది కోట్ల రూపాయలను మాత్రం కుమ్మరించిన మాట వాస్తవం.అయినా సరే మేము పవన్ ను లెక్కలోకి కూడా తీసుకోము అంటూనే పవన్ పై విష ప్రచారం చెయ్యడం కొనసాగించి అబద్దపు పోస్టులను చంద్రబాబుతో పవన్ కలిసే ఉన్నాడని మరోసారి ఏపీ ప్రజలను మోసం చేద్దామని ప్రయత్నించి దెబ్బ తిన్నారు.

పవన్ పుట్టిన రోజున చంద్రబాబు ఇచ్చిన దాదాపు 2000 కోట్ల నల్లధనాన్ని వైట్ గా మార్చి జమచేసుకునే యోచనలో జనసేన శ్రేణులు విరాళాలు సేకరిస్తున్నారని వైసీపీ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టును పెట్టగా అది పెద్ద సంచలనమే రేపింది.దీనితో ఇప్పటి వరకు ఎన్ని అన్నా ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినా కూడా మౌనంగా ఉన్న జనసేన పార్టీ అధినేత రంగంలోకి దిగే సరికి వైసీపీ ఆ పోస్టును తమ ఖాతా నుంచి తొలగించి వేసింది.

అంటే దీనిని బట్టి పవన్ చంద్రబాబుతో కలిసే ఉన్నారు అన్న మాట అవాస్తవం అని వారే ఒప్పుకున్నారు.ఒకవేళ నిజంగానే దీనికి సంబంధించి వారి దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఆ పోస్టును డిలేట్ చెయ్యకుండా ఉంచేవారు కదా..మొత్తానికి మాత్రం వైసీపీలోని ఉన్న భయాన్ని జనసేన అధినేత బయటపెట్టించారని చెప్పాలి.