హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం..!

Thursday, May 28th, 2020, 03:02:29 PM IST


హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాలానగర్ స్టేషన్ పరిధిలో రంగారెడ్డి నగర్ లో ఫ్యాన్ లను తయారీ చేసే ఒక కంపెనీ లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటన కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పలువురు ఫైర్ స్టేషన్ కి కాల్ చేయడం తో అక్కడికి చేరుకున్న అధికారులు, మంటలను ఆపేసెందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే భారీగా అస్తి నష్ట సభవించినట్లు తెలుస్తోంది. బాలా నగర్ లో జరిగిన ఈ ఘటన పలువురు నీ ఆందోళన కు గురి చేస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. పలు చోట్ల లాక్ డౌన్ కారణంగా ఇలాంటి ఘటనలో సంభవిస్తున్నాయి. చాలా రోజుల తరువాత లాక్ డౌన్ సడలింపు ల నేపధ్యంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దట్టమైన నల్లని పోగలతో సంఘటన స్థలం భయాందోళన కు గురి చేస్తుంది. అయితే ఈ ఘటన పై కంపెనీ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.