బ్రేకింగ్: ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్..!

Monday, March 23rd, 2020, 08:36:53 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలను ముమ్మరం చేసింది. ఇలాంటి నేపధ్యంలో ఏపీలో ఇప్పటికే ఆరు పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో మొదటి కరోనా పాజిటివ్ యువకకుడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.

అయితే ఇటలీలో ఎంఎస్ చదువుతున్న యువకుడు నెల్లూరుకు వచ్చాడు. అయితే కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ కుర్రాడికి టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ యువకుడిని ఈ నెల 9 న ప్రొఫెషర్ నరేంద్ర బృందం చికిత్స చేసింది. చికిత్స అనంతరం మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా తాజాగా నెగిటివ్ అని రావడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. అయితే ఈ యువకుడిని మరో 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచి మరో సారి పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.