కట్టుబాట్లు నా కడుపును నింపుతాయా…?

Friday, November 4th, 2016, 06:37:35 PM IST

samajam
సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కే కొద్దీ కట్టుబాట్లు కట్టలు తెంచుకుంటున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో కొన్ని మతాలలో, కులాల్లో కొన్ని కట్టుబాట్లు అమల్లో ఉండేవి. అయితే అవి ఆ సమయంలో ఆచరిస్తే బాగుండేది. కానీ సమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్నా, మనిషి వ్యక్తిగత స్వేచ్చా జీవితంలోకి అడుగుపెడుతున్నా కొద్ది ఇకా కట్టుబాట్లకు బాసిసవ్వడం వల్ల ప్రయోజనం శూన్యం అని గ్రహించిన ముస్లీం మహిళ తన కట్టుబాట్లను పక్కనబెట్టి పనికి నడుం బిగించింది. దీనికి సంబంధించిన కథే ఇదీ.. ఆ ముస్లీం యువతి పేరు సయ్యదా నస్రీన్. ఆమె చాలా కష్టపడి తన సొంత డబ్బులను పోగుచేసి బతుకు బండి సాఫీగా నడవడానికి ఈ రిక్షాను తన భర్తకు కొనిచ్చింది. అయితే భర్త ఆ రిక్షాను తాకట్టు బెట్టి తాగుడుకు బానిసయితే ఆ మిస్లీం మహిళ కట్టుబాట్లన్నింటినీ పక్కన బెట్టి ఈ రిక్షాను చేతబట్టి బతుకు బండిని విజయవంతంగా నడుపుతుంది. ఢిల్లీ లో మొట్టమొదటి ఈ రిక్షా నడిపిన మహిళ ఈవిడే కావడం విశేషం.