ఫస్ట్ లుక్ : హలో గురు ప్రేమకోసమే

Tuesday, May 15th, 2018, 01:11:29 AM IST

యంగ్ హీరో రామ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రెయేషన్స్ పతాకంపై సినిమా చూపిస్త మామ, నేను లోకల్ చిత్రాల దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతున్న నూతన చిత్రం హలో గురు ప్రేమకోసమే. హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఇందులో రామ్, అనుపమలు నడిచివెళుతున్న స్టిల్ ఒకటి రిలీజ్ చేసారు.

రామ్ లుక్ ఇందులో చాలా స్టైలిష్ గా ఫార్మల్ వేర్ లో అదిరందని చెప్పుకోవాలి. అనుపమ కూడా పక్కా ట్రెడిషినల్ లుక్ పంజాబీలో చాలా బాగుంది. పోస్టర్ లో ఇద్దరివద్ద వున్న ఐడి కార్డ్స్ గమనిస్తే ఇద్దరు కాలేజీ విద్యార్థులు కానీ, లేదా ఏదో సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చక చకా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది……

  •  
  •  
  •  
  •  

Comments