ఫస్ట్ లుక్ : “మహానటి” లో ‘మధురవాణి’

Friday, April 6th, 2018, 06:45:14 PM IST

తెలుగు వారు వున్నంతవరకు ఎప్పటికీ మరిచిపోలేని పేరు మహానటి సావిత్రి. వాస్తవానికి తెలుగు సినిమాలో ఆమె స్థానం ఎవరు భర్తీ చేయలేనిది. హీరోయిన్ అంటే సావిత్రిలా ఉండాలి అని అందరూ ఆమె పేరునే సూచిస్తారంటే, ఆవిడ గొప్పదం ఏంటో అర్ధమవుతోంది. ఆమె జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘మహానటి’. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆమె గెటప్ ని ఎక్కడా రెవీల్ చేయని టీం, తొలిసారి ఆ సినిమా లోని మధురవాణి ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేసింది. ఈ పోస్టర్ విషయమై ‘నా పేరు కన్యాశుల్కంలో సావిత్రి గారి పేరే’ అదేనండీ ‘మధురవాణి’ (B.A Gold Medal) అంటూ ట్వీట్ చేశారు సమంత.

సమంత నటిస్తున్న తాజా సినిమా ‘మహానటి’ లో ఆమె పేరు మధురవాణి. కాగా ఈ సినిమాలో మధురవాణిగా ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో తమ తమ పాత్రలకు నటీనటులంతా సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నార‌ట‌. అందుకే స‌మంత కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని త‌న వాయిస్ వినిపించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ మే 9వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…..

  •  
  •  
  •  
  •  

Comments