ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య జరిగిన తొలి టీ20లో భారత్ సూపర్ విక్టరీ నమోదు చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 11 పరుగల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. శిఖర్ ధావన్ (1), కోహ్లీ (9) స్వల్ఫ పరుగులకే ఔట్ అయినా శాంసన్ (23), కే ఎల్ రాహుల్ (51) పరుగులతో రాణించగా, చివర్లో జడేజా వరుస బౌండరీలతో రెచ్చిపోయి ఆడాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కి ఓపెనర్లు ఫించ్, షార్ట్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఫించ్ (35), డీఆర్కీ షార్ట్ (34), హెన్రిక్స్ (30) పరుగులు చేయగా మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరూ రాణించలేకపోయారు. దీంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో 150 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలలో చాహల్ మూడు వికెట్లు, నటరాజన్ మూడు వికెట్లు తీశారు. ఇక మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 1-0 తో లీడ్ లో ఉంది.