తొలిసారి బుల్లి తెరపై బన్నీ?

Sunday, February 18th, 2018, 05:32:44 PM IST

స్టార్ మా లో చాలా బాగా పాపులరయి మంచి రేటింగ్స్ సాధించిన షో బిగ్ బాస్. విజయవంతంగా పూర్తయిన సీజన్-1 తరువాత ప్రస్తుతం సీజన్-2 కి సంబందించి వర్క్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అన్నిటికంటే ఆ షోకి ముఖ్యమైన ఆ షో హోస్ట్ విషయానికి సంబంధిచి ఒక వార్త సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్గా మారింది. మొదటి సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించిన తారక్ నే ఈ సీజన్ కి కూడా మా ఎంచుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ షో నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రారంభం కానున్న త్రివిక్రమ్ చిత్రం షూటింగ్ కొంత ఆలస్యం కానుండడం ఒక కారణం అయితే ఆగష్టు మొదటి వారంలో రాజమౌళి చిత్రంలో కూడా ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఒక ప్రక్క త్రివిక్రమ్, మరొక ప్రక్క రాజమౌళి ల చిత్రాలతో ఆయన మరింత బిజీ కానున్నారట. అందువల్ల షూటింగ్ మధ్యలో బ్రేకులు ఇచ్చి ముంబై వెళ్లి బిగ్ బాస్ షో షూట్ లో పాల్గొని రావడమనేది కొంత ఒత్తిడి తో కూడుకున్న పని కనుక ఆయన స్టార్ మా కు తాను రెండవ సీజన్లో హోస్ట్ గా చేయలేనని చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఆయన స్థానంలో బన్నీ అయితే బాగుంటాడని, ప్రస్తుతం నా పేరు సూర్య తరువాత తన తదుపరి చిత్రం ఇంతవరకు ప్రకటించని బన్నీకి కొంత గ్యాప్ ఉందని తెలుస్తోంది. అదీ కాక తారక్ లో ఉన్నంత ఈజ్ బన్నీలోను ఉంటుందని మా బృందంకూడా ఆయనకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రానప్పటికీ ఒక వేళ బన్నీ ని కనుక షో కి హోస్టుగా తీసుకున్నట్లయితే రేటింగ్స్ మరింత పెరుగుతాయేతప్ప తగ్గే అవకాశం లేదని సినీ వర్గాలంటున్నాయి….