ఫిట్‌నెస్ ఉంటే లైఫంతా ఛీర్ చేసుకోవచ్చు!!!

Thursday, November 17th, 2016, 11:28:32 PM IST

ramcharan-slaman
ఫిట్‌నెస్ ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. జీవితంలో నైరాశ్యాన్ని పార‌ద్రోలే గొప్ప మంత్రం. అయితే దీనికి ఎంత‌మంది అడిక్ట్ అయ్యి ఉన్నారు? ఇదిగో నిజజీవితంలో ఫిట్‌నెస్ కోసం త‌పించే ఓ ఐదుగురు ఇలా ఒకేచోట క‌లిశారు. ఉపాస‌న‌- రామ్‌చ‌ర‌ణ్‌-స‌ల్మాన్‌ఖాన్‌- సానియా మీర్జా- హ్యూమా ఖురేషి .. వీళ్లంద‌రూ ఒకేచోట చేరి ఇలా ఫోటో దిగారు. ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషీ చేశారు.

చ‌ర‌ణ్ – ఉపాస‌న జంట ఫిట్‌నెస్ విష‌యంలో చాలా ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తారు. అలాగే బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్‌ఖాన్ ఫిట్‌నెస్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. టెన్సిస్ స్టార్ సానియా మీర్జా ఆట‌స్థ‌లంలో క‌స‌ర‌త్తుల‌తో వెరీ ఫిట్‌. అలాగే బాలీవుడ్ యువ‌నాయిక హ్యూమా ఖురేషికి ఫిట్‌నెస్‌పై ఉన్న అవ‌గాహ‌న మైండ్ బ్లోవింగ్‌. అందుకే వీళ్లంతా ఒకేచోట చేరి ఇలా ఫోజులిచ్చారు. “హార్డ్ వ‌ర్క్ రియ‌ల్లీ పేస్ ఆఫ్‌. ఛీర్స్ టు యువ‌ర్ ఫిట్‌నెస్ గోల్స్‌“ అంటూ ఉపాస‌న రామ్‌చ‌ర‌ణ్ సామాజిక మాధ్య‌మంలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ వెబ్‌సైట్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.