శ్రీ‌దేవి 50 ఏళ్ల సినీజీవితంపై ఐదు సినిమాలు?

Friday, February 16th, 2018, 03:42:15 PM IST

దాదాపు యాభై ఏళ్లుగా సినీరంగంలో క‌థానాయిక‌గా వెలుగులు విరజిమ్ముతున్నారు అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి(53). తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డం … ప‌రిశ్ర‌మ ఏదైనా శ్రీ‌దేవికి ఉన్న గుర్తింపు అసాధార‌ణం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిగా వీరాభిమానులున్నారు. ఐదు ద‌శాబ్ధాల కెరీర్‌లో వంద‌లాది సినిమాల్లో న‌టించి మెప్పించారు. చివ‌రిగా బాలీవుడ్ నాయిక‌గా సెటిలై, అక్క‌డే బోనీ క‌పూర్‌ని పెళ్లాడి లైఫ్‌లో సెటిల‌య్యారు. శ్రీ‌దేవి న‌ట‌జీవితంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు.. అనుభ‌వాలు .. అనుభూతులు.. వాట‌న్నిటినీ తెర‌కెక్కించేందుకు రంగం సిద్ద‌మ‌వుతోంది.

అయితే ఇవి ఫీచ‌ర్ సినిమాలు కావు. డాక్యు సినిమాలు. ఐదు భాగాలుగా ఐదు డాక్యు సినిమాలుగా తెర‌కెక్కించేందుకు శ్రీ‌దేవి బెంగ‌ళూరు అభిమాన సంఘం రెడీ అవుతోంది. ఆ మేర‌కు ఇప్ప‌టికే శ్రీ‌దేవి భ‌ర్త బోనీక‌పూర్ అనుమ‌తి తీసుకున్నారు. శ్రీ‌దేవి బాల్యం.. బాల‌న‌టిగా కెరీర్‌పై ఓ సినిమా, యుక్త‌వ‌య‌సులో క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసి, కెరీర్‌లో వెలుగులు విర‌జిమ్మిన తీరుపై ఓ రెండు సినిమాలు, అలాగే క‌థానాయిక‌గా పీక్స్‌లో ఉండ‌గానే బోనీని పెళ్లాడిన‌ప్ప‌టి జీవితం, ఫ్యామిలీ లైఫ్ పై వేరొక సినిమా, అటుపై ఇంగ్లీష్ వింగ్లీష్‌తో రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టి, ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకోవ‌డం వ‌ర‌కూ మ‌రో డాక్యు సినిమా తెర‌కెక్కించ‌నున్నారు. ఐదు సినిమాల్లో శ్రీ‌దేవి యాభై ఏళ్ల సినీకెరీర్ .. సాగించిన జీవ‌న యానం క‌నిపిస్తుంది. డాక్యు డ్రామా సినిమాలుగా వీటిని చెబుతున్నారు. నాలుగేళ్ల వ‌య‌సులో శ్రీ‌దేవి ముఖానికి రంగేసుకుని బాల‌న‌టిగా తెరంగేట్రం చేశారు. ఎంఏ తిరుముగ‌మ్ తెర‌కెక్కించిన `తునైవాన్‌` అనే చిత్రంతో బాల‌న‌టిగా కెరీర్ మొద‌లైంది. ఆ త‌ర్వాత‌ త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డంలో న‌టించారు. ఇదంతా తొలి సినిమాలో చూపిస్తారు. `జూలీ`(1975)గా బాలీవుడ్‌లో ,`మూండ్రు ముడిచ్చు` చిత్రంతో కోలీవుడ్‌లో క‌థానాయిక‌గా రంగ ప్ర‌వేశం చేశారు శ్రీ‌దేవి. ఆ మొత్తం కెరీర్‌ని రెండు, మూడు భాగాల్లో చూపిస్తారు. `సొల్వ సావ‌న్` (1978) అనే చిత్రంతో క‌థానాయిక‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీ‌దేవి, ఆ త‌ర్వాత హిమ్మ‌త్‌వాలా(1983), మిస్ట‌ర్ ఇండియా (1987), చాందిని (1989), సాద్మ‌(1983), నాగిన (1986), చాల్‌బాజ్ (1989), ల‌మ్హే (1991), ఖుదా గ‌వా (1992), గుమ్రా (1993), లాడ్ల (1994) వంటి ప‌లు క్లాసిక్‌ చిత్రాల్లో శ్రీ‌దేవి న‌టించారు. ఈ కెరీర్ ఆద్యంతం ఓ డాక్యు ఫిలింగా చూపిస్తారు. ఫ్యామిలీ లైఫ్‌, పిల్ల‌లు, సంసార బాధ్య‌త‌లు, `ఇంగ్లీష్ వింగ్లీష్‌` సినిమాతో రీఎంట్రీ, ఆ క్ర‌మంలోనే ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకోవ‌డం ఇవ‌న్నీ చివ‌రి భాగంలో చూపిస్తారు. ఒక మేటి క‌థానాయిక చ‌రిత్ర‌ను ఇలా డాక్యు సినిమాలుగా నిక్షిప్తం చేయ‌డం భావి త‌రాల‌కు ఎంతో ఉప‌యుక్తం. ప్ర‌శంసించ‌ద‌గ్గ గొప్ప ప్ర‌య‌త్నం అనే చెప్పాలి.