రాష్ట్రానికి ఐదుగురు కొత్త ఆర్టీఐ కమిషనర్లు…?

Tuesday, February 11th, 2020, 12:47:38 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. రాష్ట్రానికి కొత్తగా ఐదుగురు ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కట్టా శేఖర్ రెడ్డి, గుగులోతు శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మైదా నారాయణరెడ్డి, డాక్టర్ మొహ్మద్, అమీర్ హుస్సేన్‌లను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు అధికారికంగా విడుదల చేశారు. ఇకపోతే ఆ ఐదుగురు తమ బాధ్యతలను వారికి 65 సంవత్సరాలు వచ్చే వరకు నిర్వహించనున్నారు. వారందరు కూడా తమ బాధ్యతలను త్వరలోనే నిర్వహించడానికి సిద్దమవ్వనున్నారని సమాచారం.

ఇకపోతే ఇప్పటికే కట్టా శేఖర్ రెడ్డి నమస్తే తెలంగాణ ఎడిటర్ ఎడిటర్‌గా ఉండగా, మైదా నారాయణరెడ్డి టీ న్యూస్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ మొహ్మద్ అమీర్ హుస్సేన్ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ. కేసీఆర్ సేవాదళ్ పేరుతో సామాజిక సేవ చేస్తున్నారు. పార్టీ తరఫున నిర్వహించే రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూ ఉంటారు. సయ్యద్ ఖలీలుల్లా వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన పేరును ఎంఐఎం ప్రతిపాదించినట్టు తెలిసింది.