ఫ్లాష్ ఫ్లాష్ : యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు!

Sunday, April 1st, 2018, 06:39:52 PM IST

బుల్లితెరకు చెందిన వ్యాఖ్యాతల్లో ఎవరు బాగా చేస్తారు అని అడిగితే అందరూ ఠక్కున సుమ గారి పేరు చెపుతారు. వ్యాఖ్యాతగా వ్యవహరించడమే అన్నికంటే కష్టం అని, కాకపోతే కొంచెం అలవాటు అయితే మనపై మనకు పట్టు వస్తుంది అని ఆమె పలు మార్లు చెపుతుంటారు కూడా. అలానే ఈ మధ్య కాలం లో శ్యామల, శ్రీముఖి, అనసూయ, రేష్మి వంటి వారు ఆ విభాగాల్లో దూసుకుపోతున్నారు. వీరిలో ఒకరైన యాంకర్ శ్యామల ఒక ప్రముఖ టివి షో పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పటాస్’ వంటి టీవీ షోస్ ను తాను చేయలేనని, అటువంటి షోస్ గోదావరి జిల్లాలకు చెందిన తనకు పడవని, అయితే తాను వాటిని చూసి బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పారు.

ఇతరులను గౌరవించకుండా పిలవడం తనకు చేతకాదని, గోదావరి ప్రజలకు అలవాటైన ‘అండి’, ‘గారు’ వంటి పదాలు వాడకుండా తాను మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. అలానే ఒరేయ్, వాడు, నీ యంకమ్మ వంటి మాటలను మాట్లాడలేనని చెప్పారు. నిజానికి అటువంటి షోలకి అలా వ్యవహరించడమే కరెక్ట్ అని ఆమె అన్నారు. అయితే కొన్ని ఆడియో ఫంక్షన్లలో తాను ధరించిన దుస్తులపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, వేసుకునే దుస్తులపై నిర్ణయం తానే తీసుకుంటానని, మరెవరి ప్రమేయం ఉండదని శ్యామల వెల్లడించారు…..