ఫ్లాష్ న్యూస్ : మరీ అంత అవసరమా రాజమౌళి సారూ !!

Tuesday, April 3rd, 2018, 09:15:28 PM IST


జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో తెరకెక్కకున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టి స్టారర్ మూవీకి సంబంధించి ఏదైనా సరే హాట్ న్యూస్ గా మారుతోంది. తాను ఇంకా కథనే వినలేదు అని రామ్ చరణ్ స్పష్టం చేసిన నేపధ్యంలో, నేడు ఎన్టీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ, తాను కూడా కథ ఇంకా వినలేదని, రాజమౌళి మాత్రం సినిమాకి సిద్ధంగా ఉండాలని మాత్రమే చెప్పారని అన్నారు. ఇకపోతే దీనికి బడ్జెట్ ఎంత పెడతారు అనే దాని గురించి ఇప్పటికే ఇద్దరు హీరోల అభిమానుల మధ్య హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఎంత లేదన్నా దీనికి 250 కోట్ల దాకా బడ్జెట్ అవుతుందని అందుకు తగ్గట్టు ప్రిపేర్ కావాలని నిర్మాత డివివి దానయ్యకు రాజమౌళి చెప్పినట్టు సమాచారం.

ఇది నిజమో కాదో తెలియదుకాని, ఈ ఫిగర్ విన్న వాళ్ళు మాత్రం వామ్మో అనకుండా ఉండలేకపోతున్నారు. బాహుబలికి ఇంతకు మించి అయినప్పటికీ దాని జానర్ వేరు కాబట్టి బాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా దానికి బ్రహ్మరధం పట్టారు. కాని ఇప్పుడు తీయబోయే మల్టీ స్టారర్ ఒక కమర్షియల్ మూవీ. రెగ్యులర్ ఫార్ములాలో జక్కన్న తనదైన శైలిలో మిక్స్ చేసే హీరోయిజంతో ఉంటుంది. అయితే మరీ ఇంత బడ్జెట్ ఎందుకు అన్నవాదన వినిపిస్తోంది. కాని ఇన్ సైడ్ టాక్ ప్రకారం కమర్షియల్ మూవీనే అయినప్పటికీ యాక్షన్ పరంగా ఇందులో భారీ సీక్వెన్స్ లు, సన్నివేశాలు వుండనున్నాయని టాక్.

దాని కోసమే ఇంత డిమాండ్ చేయక తప్పడం లేదని చెబుతున్నారు. మరి ఇందులో ఇద్దరు స్టార్ హీరోల రెమ్యునరేషన్లు కలిపే ఉన్నాయా లేక అవి వేరుగానా అనేది మాత్రం ఇంకా తెలియదు. మొత్తానికి ఈ బడ్జెట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయినా రాజమౌళి కంటెంట్ కి మార్కెటింగ్ ప్లాన్ కి ఎంత పెట్టినా వెనక్కు వస్తుందని అభిమానుల నమ్మకం. ఎంతైనా అపజయమెరుగని రాజమౌళి టేకింగ్ మీద జనాలకి, అలానే నిర్మాతలకి వున్న నమ్మకం అటువంటిది…..