ఫ్లాష్ న్యూస్ : ఆ రెండు ఈవెంట్స్ కి బ్రాండ్ అంబాసడర్ గా ఎన్టీఆర్ ??

Tuesday, March 27th, 2018, 01:12:26 PM IST

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో టివి ఆడియెన్స్ కి బాగా దగ్గరైన విషయం తెలిసిందే. అయితే ఆ షో థర్వుఆతి సెఅసొంలో మాత్రం ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించడం లేదు. బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేనని ఆ షో నిర్వాహకులకు చెప్పినట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్, రాజమౌళి ప్రాజెక్టుల విషయమై ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఆయన స్థానంలో లక్కీగా న్యాచురల్ స్టార్ నాని ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నారు. అయితే మరో విదంగా బుల్లితెర అభిమానులకు చేరువకావడానికి మనోడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ టివి ఈ ఏడాది స్పోర్ట్స్ ఈవెంట్స్ తో భారీ స్థాయిలో బిజినెస్ ను ప్లాన్ చేసుకుంది.

ఐపీఎల్, ప్రో కబడ్డీ లీగ్ లకు ఆదరణ చాలా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే రెండింటికి సంబంధించిన ప్రమోషన్స్ లలో తెలుగు సైడ్ నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ మా త్వరలో ఎన్టీఆర్ తో ప్రోమోస్ రెడీ చేయటానికి చూస్తోంది. అంతా పూర్తయిన తరువాత టెలికాస్ట్ చేస్తారట. ఈ రెండు వర్కౌట్ అయితే ఎన్టీఆర్ రేంజ్ ఇంకా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ అంటే మనవాళ్లకు చాలా పిచ్చి. ఆ అభిమానులను తెలివిగా ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి దక్కించుకున్నారు, అంటే చాలు ఎన్టీఆర్ హోదా ఇంకా పెరుగుతుంది. ఇక ఐపీఎల్ వచ్చే నెల ఏప్రిల్ 7 నుంచి స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే…