150 టిక్కెట్‌పై రూ.75 రిట‌ర్న్ ఇస్తారుట‌!

Wednesday, March 28th, 2018, 10:04:41 PM IST


ఆన్‌లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ‌లోకి కొత్త కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటిలో బుక్ మై షో వంటివి స్థిరంగా పాతుకుపోయి భారీ వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఇలాంటి వాటిని కొట్టాలంటే కొత్త‌గా వ‌చ్చే వెబ్‌సైట్ల‌కు అంత వీజీనా? అందుకే కొత్త‌గా ఏదైనా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సైట్ నిల‌దొక్కుకునేందుకు భారీ ఆఫ‌ర్లతో ముందుకు రావ‌డం, మ‌నీ బ్యాక్‌, క్యాష్ బ్యాక్ అంటూ ఊద‌రగొట్టేయడం ద్వారా ఇవి కూడా పాపుల‌ర‌వుతున్నాయి. న‌మ్మ‌కం కంటే డిస్కౌంట్ ఆఫ‌ర్‌కే త‌లొగ్గే మ‌న ఆడియెన్ ప‌ల్స్‌కి త‌గ్గ‌ట్టే వీటి వ్యాపారం సాగుతోంది.

ఇక‌పోతే గ‌త కొద్ది కాలంగా ఫోన్ పే యాప్ యూత్ మొబైల్స్‌లో ప్ర‌ధాన ఆన్‌లైన్ బుకింగ్ వ్య‌వ‌హారాల్ని కాప్చుర్ చేస్తోంది. ఈ ఆన్‌లైన్ దిగ్గ‌జం తాజాగా మూవీ టికెట్ల బుకింగుల‌పై భారీ మ‌నీ బ్యాక్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. `ఫోన్ పే` ద్వారా ఈనెల 29, 30, 31 తేదీల్లో టిక్కెట్లు కొనుక్కుంటే రూ.150 టిక్కెట్‌పై రూ.75 రిట‌ర్న్ ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆ మూడు రోజుల్లో ప‌లు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. రామ్ చ‌ర‌ణ్- రంగ‌స్థ‌లం, టైగ‌ర్ ష్రాఫ్ – భాఘి-2 చిత్రాలు ఈ వారం రిలీజ్‌ల‌కు రెడీ అవుతున్న నేప‌థ్యంలో ఆన్లైన్ టికెటింగ్‌లో ఈ ఆఫ‌ర్‌ని వినియోగించుకోవ‌చ్చు. వీటితో పాటు రాణీ ముఖ‌ర్జీ `హిచ్‌కీ`, అజ‌య్ దేవ‌గ‌న్ `రెయిడ్‌` చిత్రాలు ప‌లు హాలీవుడ్ సినిమాల‌కు ఈ డిస్కౌంట్ , క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ఫోన్ పే వెల్ల‌డించింది. స‌గానికి స‌గం క్యాష్ బ్యాక్ అని ఆశ‌ప‌డ్డారు స‌రే.. అది ఎన్ని టిక్కెట్లు కొంటే స‌ద‌రు కంపెనీ వెన‌క్కి ఇస్తుంది? అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది.