టర్కీ లో విమాన ప్రమాదం – రెండు ముక్కలైన విమానం

Wednesday, February 5th, 2020, 11:38:12 PM IST

టర్కీలోని ఇస్తాంబుల్ సిటీలో కొద్దీ సేపటిక్రితం ఇస్తాంబుల్‌లోని సబీహా గోకెన్ విమానాశ్రయంలో ఒక విమాన ప్రమాదం జరిగింది. ఇస్తాంబుల్ లోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవడానికి వచ్చినటువంటి ఒక విమానం అదుపు తప్పి, రన్ వే నుండి పక్కకి దూసుకెళ్లి పడింది. ఆ తరువాత ఆ విమానం తీవ్రమైన మంటలతో రెండు ముక్కలుగా విడిపోయింది. కాగా ఈ ప్రమాదంలో విమానం లోని 23 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి… కాగా ఈ విమానం పేగాసస్ ఎయిర్‌లైన్స్‌కి చెందినదని విమాన అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని, కానీ పెద్దగా ఎవరు గాయపడలేదని సమాచారం. అయితే విమానంలో మంటలు రావడాన్ని గమనించిన విమానాశ్రయ సిబ్బంది త్వరగా స్పందించి, ఆ మంటలను అదుపు చేశారు. లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు భావించారు. ఇకపోతే గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.