అమెరికా మాజీ అధ్య‌క్షుడి సీక్రెట్స్ లీక్‌

Friday, October 27th, 2017, 10:49:36 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌, నాటి యుఎస్ సెక్ర‌ట‌రీ కొలిన్ పావెల్ జాత‌కాలు బ‌య‌టికి రానున్నాయా? ఆ ఇరువురి భోగోతం వెండితెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం. అగ్ర‌రాజ్యం స్వార్థ‌పూరిత ఆలోచ‌న‌ల‌తో ఇరాక్ ఆక్ర‌మ‌ణ‌కు దిగుతున్న వేళ ఆ చ‌ర్య‌ను ఎలాంటి బెరుకు లేకుండా వ్య‌తిరేకించిన పొవెల్ పాత్ర ఆధారంగా ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు తెర‌కెక్కి రిలీజ‌య్యాయి. తాజాగా మ‌రో సినిమాను తెర‌కెక్కించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈసారి పోవెల్ పాత్ర‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ట‌ర్ మోర్గాన్ ఫ్రీమాన్ న‌టించ‌నున్నారు. మార్ష‌ల్ ఫేం రెజినాల్డ్ హ‌డ్లిన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

వాస్త‌వానికి జార్జ్ బుష్ ప్ర‌భుత్వం ఇరాక్‌పై దాడి చేయ‌డానికి కార‌ణాలేంటో ప్ర‌పంచానికి ప్ర‌త్య‌క్షంగా తెలుసు. ఇరాక్ అక్ర‌మ అణ్వాయుధాల్ని క‌లిగి ఉంద‌న్న నెపంతో యుద్ధం చేసి .. ఆ దేశాన్ని స్వాధీనపర్చుకుని పెట్రోల్ త‌దిత‌ర ఇంధ‌నాల్ని త‌మ దేశానికి త‌ర‌లించుకునే కుట్ర‌కు అగ్ర‌దేశం పాల్ప‌డింది. అయితే ఆ క్ర‌మంలోనే జార్జి బుష్ ఆలోచ‌న‌ల్ని వ్య‌తిరేకించారు పోవెల్‌. అయితే ఆ త‌ర్వాత అత‌డి నోరు మూయించిన బుష్ త‌న‌కు కావాల్సింది చేశారు. ఇదే కాన్సెప్టుతో ఇదివ‌ర‌కూ సినిమాలు వ‌చ్చినా అస‌లు వాస్త‌వాల్ని వెల్ల‌డించ‌లేక‌పోయాయి. కానీ ఈసారి మాత్రం సిన్సియ‌ర్‌గా పోవెల్ పాత్ర‌తో ఆ విష‌యాల‌న్నిటినీ వెండితెర‌పై చ‌ర్చించ‌నున్నార‌ని తెలుస్తోంది. కొలిన్ పోవెల్ యూఎస్ సెనేట్‌లో ప‌ద‌వి చేప‌ట్టిన తొలి ఆఫ్రిక‌న్‌-అమెరిక‌న్ అన్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments