జేపీలో చేరిన మాజీ గవర్నర్

Tuesday, September 17th, 2019, 01:02:10 AM IST

సోమవారం నాడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు భాజపాలో చేరారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేతుల మీదుగా విద్యాసాగర్ రావు పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. ఆతరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన విద్యాసాగర్ రావు బీజేపీ లో చేరడం ఆనందంగా ఉందని వివరించారు. అంతేకాకుండా తానూ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించినపుడు పార్టీ కి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని, కానీ పార్టీ తరపున మళ్ళీ సభ్యత్వాన్ని తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందని, కానీ ఆ సమయంలో రాజీనామా చేసే సమయంలో చాల బాధ కలిగిందని విద్యాసాగరరావు వివరించారు.

ఇకపోతే బీజేపీ కి తెలంగాణాలో కూడా మంచి రోజులు వస్తున్నాయని, రానున్న రోజుల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరని వివరించారు విద్యాసాగరరావు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీ కి నిబద్దతతో పని చేస్తానని, ప్రతీ గ్రామాల్లో పార్టీ కార్యాలయం ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని వివరించారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ కొత్త అసెంబ్లీ నిర్మాణం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదని హైకోర్టు చెప్పడం ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని వివరించారు.