బ్రేకింగ్ : పరారీలో అఖిల ప్రియ భర్త..సినీ పక్కీలో జంప్

Wednesday, October 9th, 2019, 11:08:26 AM IST

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీలు చాలా మంది జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత పరారీలో ఉంటున్నారు. ఆ కేసులు ఈ కేసులు అంటూ పాతవి,కొత్తవి కలిపి టీడీపీ నేతలను ఉచ్చులో బంధిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది పోలీసులకి చిక్కకుండా పరారీలో ఉంది. ముందస్తు బెయిల్ పెట్టుకోవటంతో లేక, డైరెక్ట్ గా కోర్టుకి హాజరవటంతో చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పోలీసులకి చిక్కకుండా పరారయ్యాడు.

అతని మీద ఇప్పటికే ఆళ్లగడ్డలో అనేక కేసులు ఉన్నాయి. దీనితో ఆళ్లగడ్డ వదిలేసి హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటున్నాడు, ఈ క్రమంలో అతన్ని పట్టుకోవటం కోసం ఆళ్లగడ్డ నుండి పోలీసులు హైదరాబాద్ వచ్చి,గచ్చిబౌలి ఏరియాలో అతను ఉంటున్నట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో మాటువేసిన పోలీసులకి అతను కారులో వెళ్తున్నట్లు సమాచారం వచ్చింది. దీనితో గచ్చిబౌలి దగ్గర అతని కారుని ఆపమని పోలీసులు కోరారు..దీనితో కారు అవుతున్నట్లు స్లో చేసి, ఒక్కసారిగా అక్కడ నుండి పరారీ అయ్యాడు.

దీనితో పోలీసులు బిత్తరపోయారు. అతను కారు అవుతున్నాడు అనుకోని ముందుకి వచ్చారు, ఒక ఊపున కారుతో వాళ్ళని ఢీకోట్టినట్లు చేస్తూ వెళ్ళిపోయాడు. దాని పట్టుకోవటం కోసం పోలీసులు వెంబడించిన కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీనితో ఆళ్లగడ్డ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకి ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఒక మాజీ మంత్రి భర్త ఇలా పరారీ కావటం అనేది నిజంగా విడ్డురమే.. ఇక పరారైన భార్గవ్ రామ్ బెంగుళూరు చేరుకున్నట్లు తెలుస్తుంది.