మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ – 24 గంటల్లోనే ఇద్దరికీ సాయం

Saturday, October 19th, 2019, 10:05:14 PM IST

తెరాస పార్టీ కి చెందిన మాజీ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన మానవత్వాన్ని చాటుకున్నారు. కేవలం 24 గంటల్లోనే ఆపదలో ఉన్నవారికి ఇద్దరికీ సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకతను ఒక ప్రమాదం కారణంగా చాలా తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతని పరిస్థితి చుసిన స్థానిక ఆసుపత్రుల వారు అతడిని చేర్చుకోలేదు. దీంతో ఆ క్షతగాత్రుడిని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారున్న ఆర్థిక పరిస్థితి కారణంగా, ఆసుపత్రి ఖర్చుని భరించే స్తొమత వారికి లేదు. అయితే ఈమేరకు సురేష్ అనే ఒక యువకుడు సదరు క్షతగాత్రుడి బాధను వివరిస్తూ, అతడి చికిత్స పొందుతున్న ఫోటోను, బాధితుడి వివరాలను కలిపి ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. కాగా ఈ పోస్టుని చూసిన మాజీ ఎంపీ కవిత వెంటనే స్పందించి, తన కార్యాలయ ఫోన్ నంబర్ ని అందించి, ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే వారు తమ సమస్యని పరిష్కరిస్తారని కవిత భరోసా ఇచ్చి, తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.