లోకేష్ పై ఫైర్ అవుతున్న మాజీ టీడీపీ నేత – ఇంతకీ ఎవరతను…?

Thursday, July 11th, 2019, 01:23:48 AM IST

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీలో టీడీపీ కి ఇక భవిష్యత్తు ఉండదేమో అనే మాట అందరు కూడా చెబుతున్నారు. ఎప్పుడైతే ఎన్నికల్లో టీడీపీ పార్టీ దారుణమైన ఓటమిని మూటకట్టుకుందో ఇక అప్పటినుండి అందరు కూడా టీడీపీ ని వదిలిపోతున్నారు. అంతేకాకుండా టీడీపీ తరపున ఎన్నికైన నేతలు కూడా టీడీపీ ని వదిలి బీజేపీలో చేరిపోతున్నారు. కాగా ఇప్పటికి కూడా ఆ వలసలు ఆగడం లేదనే చెప్పాలి. తాజాగా నేడు కూడా ఒక టీడీపీ నేత టీడీపీ ని వదిలి వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే అతను టీడీపీ పార్టీకి రాజీనామా చేశాడో, ఇక అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు మరియు నారా లోకేష్ పై సంచలనమైన వాఖ్యలు చేశారు.

కాగా పార్టీ సభ్యత్వంతో పాటు ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ నారా లోకేష్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వినయాగాల్లో చాలా అవినీతి జరిగిన మాట వాస్తవమే అని చెప్పారు. కనీసం ఒక ఏరియాలో వార్డు మెంబరుగా కూడా గెలవడం చాతకాని లోకేష్ ని చంద్రబాబు నాయుడు మంత్రిని చేసి తన అవినీతి ప్రభుత్వానికి ఆజ్యం పోశారని అన్నారు. కానీ ఈ సతీష్ చేసిన వాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇన్నిరోజులు కూడా చంద్రబాబుకు మరియు, లోకేష్ కి ఎంతో సన్నిహితంగా మెలిగినటువంటి సతీష్ ఒకేసారి ఇలా వారిపై విమర్శలు చెయాయడం అనేది ఎవరు కూడా జీర్ణించుకొలేకపోవుతున్నారు.

ఇకపోతే ఇక పార్టీ నుండి తనతో పాటు చాలా మంది త్వరలో పార్టీనుండి వెళ్లిపోనున్నారని సతీష్ చెప్పడంతో అందరు కూడా షాక్లో ఉన్నారని సమాచారం. కాగా గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి అన్నం ఓడిపోయారు. మనసులో ఎదోపెట్టుకొని సతీష్ ఇలా మాట్లాడుతున్నాడని టీడీపీ శ్రేణులు వాఖ్యానించారు.