ఆ న‌లుగురిలో ఎవ‌రు జంబ‌ల్‌హాట్‌?

Friday, June 1st, 2018, 06:16:32 PM IST

న‌లుగురు అంద‌గ‌త్తెలు .. పెళ్లి త‌ర‌వాత స్వేచ్ఛ‌పై మా గొప్ప‌గా చెప్పారు. వీరే ది వెడ్డింగ్ సినిమా చూసిన ప్రేక్ష‌కులు చెబుతున్న మాట ఇది. గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల‌కు రానంత గొప్ప ప్ర‌చారం ఈ నాయికా ప్ర‌ధాన చిత్రానికి వ‌చ్చిందంటే ఇందులో కాన్సెప్టే అందుకు కార‌ణం. ఈ చిత్రం నేడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. స‌మీక్ష‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కంటెంట్‌ మ‌హిళా ప్రేక్ష‌కుల‌కే కాదు., పురుషపుంగ‌వుల‌కు న‌చ్చేస్తోందిట‌. పెళ్లి త‌ర‌వాత స్త్రీ స్వేచ్ఛ‌, అందులోంచి పుట్టే ఫ‌న్ అంద‌రికీ న‌చ్చేసింది. ఇక‌పోతే ఈ సినిమా ప్ర‌చారంలో న‌లుగురు అంద‌గ‌త్తెలు బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు.

ఇందులో బెబోతో పాటు సోన‌మ్ క‌పూర్‌, స్వ‌రాభాస్క‌ర్‌, వేరొక బొద్దుగుమ్మ అంతే జోరుగా మీడియా ఇంట‌ర్వ్యూల‌తో చెల‌రేగిపోతున్నారు. అయితే ఇలా చెల‌రేగిపోతున్న భామ‌ల్లో ఎవ‌రు జంబ‌ల్ హాట్ అంటూ సామాజిక మాధ్య‌మాల్లో కొత్త‌గా డిబేట్ న‌డుస్తోంది. ఒక బిడ్డ త‌ల్లి అయినా క‌రీనాక‌పూర్ ముందు మిగ‌తా భామ‌లంతా వెల‌వెల‌బోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఆంటీల యందు బెబో ఆంటీ వేర‌యా విశ్వ‌ధాభిరామ వినుర వేమ‌!

  •  
  •  
  •  
  •  

Comments