రామ్ సినిమాలో నాలుగు భాషా నటులు?

Wednesday, April 11th, 2018, 03:43:01 PM IST

యంగ్ హీరో రామ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నేను లోకల్ చిత్ర దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతున్న కొత్త సినిమా ‘హలో గురు ప్రేమకోసమే’. ప్రస్తుతం ఈ సినిమా ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే దీని తర్వాత రామ్, గరుడావెగా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా, ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి నాలుగు భాషల నుండి నటులను తీసుకోనున్నారట. బాలీవుడ్ నుండి దర్శన్ కుమార్, మలయాళం నుండి సంజు శివరాం, అలానే తమిళం నుండి మరొక ఇద్దరు నటులను తీసుకోనున్నట్లు వినికిడి.

కాగా ఈ సినిమాని పలు ఇతరభాషల్లో కూడా రిలీజ్ చేస్తారట. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాని మొదట భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిద్దామని అనుకుందట, అయితే బడ్జెట్ రామ్ మార్కెట్ ని మించి ఉందని, అంత ఖర్చు తాము భరించలేమని ఆ సంస్థ తప్పుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమాని రామ్ పెదనాన్న రవికిశోర్, ఆయన సంస్థ అయిన స్రవంతి మూవీస్ పై నిర్మించడానికి ముందుకు వచ్చారు. వచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా 2019 లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది……

  •  
  •  
  •  
  •  

Comments