ఫిఫా వరల్డ్ కప్ : మాజీ ఛాంపియన్ ను ఇంటికి పంపిన ప్రాన్స్!

Saturday, July 7th, 2018, 02:32:38 AM IST

రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఊహించని జట్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడుతున్నాయి. ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే ఫిఫా కథ సెమిస్ వరకు వచ్చింది. మాజీ ఛాంపియన్ ఉరుగ్వే మరోసారి విజయాన్ని అందుకుంటుందని సెమిస్ లో సత్తా చాటుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ప్రాన్స్ చేతిలో దారుణంగా ఓటమి పాలయ్యింది.

రెండు గోల్స్ చేసి ప్రాన్స్ అద్భుతమైన విజయాన్ని అందుకోగా ఉరుగ్వే కనీసం ఒక గోల్ కొట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది. మ్యాచ్ చివరివరకు ఉత్కంఠంగానే జరిగింది. 40వ నిమిషంలో ఫ్రాన్స్‌ ప్లేయర్ వరానే.. హెడర్‌గోల్‌తో తొలి గోల్‌ కొట్టగా సెకండ్ హాఫ్ లో గ్రీజ్‌మన్‌ గోల్‌ అద్భుతమైన ఆటతీరుతో ఒక గోల్ కొట్టి ఫ్రాన్స్‌ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. డిఫెన్స్ లో అత్యంత బలంగా ఉన్న ఉరుగ్వే ప్రాన్స్ ధాటికి సెమిస్ లో అడుగుపెట్టకుండానే ఇంటి బాట పట్టింది.

  •  
  •  
  •  
  •  

Comments