టీడీపీ ఎమ్మెల్యేపై ఫ్రాడ్ కేసు.. బాబుగారి చాప్టర్ క్లోజ్..!

Sunday, October 20th, 2019, 06:42:28 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు చేసిన అక్రమాలను, దోపీడీలను ఆధారాలతో సహా వెలికితీస్తూ వైసీపీ ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేయిస్తుంది. అయితే ఇప్పటికే చింతమనేని, యరపతినేని, కూన రవికుమార్ వంటి పలువురు నేతలపై కేసులు పెట్టి జైళ్ళకు పంపిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నిన్న ఒక ఫ్రాడ్ కేసు నమోదయ్యింది. ఎన్నికలకు ముందు తన స్థానంలో పనిచేసిన తహసీల్దార్ సంతకాన్ని వల్లభనేని వంశీ ఫోర్జరీ చేశారని, వేల సంఖ్యలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారంటూ కొత్త తహసీల్దార్ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపులపాడు గ్రామాలలో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను ఇచ్చి మోసం చేసారని, తహసీల్దార్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసును ప్రభుత్వం కనుక సీరియస్‌గా తీసుకుంటే మాత్రం ప్రజలను, అధికారులను మోసం చేసి పేదలకు దొంగ పట్టాలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని తేలితే ఆయన ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయమని, ఈయన కేసు ద్వారా బాబుగారి చాప్టర్ ఇక క్లోజ్ అవుతుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.