ఉచితంగా కటింగ్, షేవింగ్ అంటున్న హైదరాబాదీ, ఎందుకో తెలుసా?

Friday, February 14th, 2020, 08:30:32 PM IST

అభిమాన నాయకులైన, హీరోలైన, ఇష్టం ఉన్న వారి పుట్టిన రోజు వేడుకలకు అన్నదానం, రక్త దానం, లేదంటే ఎదో ఒక మంచి పని కోసం అభిమానులు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఖైరతాబాద్ కి చెందిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఉచితంగా కటింగ్, షేవింగ్ చేయబడును అంటూ ఒక బ్యానర్ ద్వారా ప్రకటించేశాడు. అయితే ప్రస్తుతం ఈ బ్యానర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిబ్రవరి 17 న పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని కేటీఆర్ ఇప్పటికే అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని హరిత హారంగా తీర్చి దిద్దాలనే లక్ష్యం తో కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. మొక్కలు నాటాలని అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.