తెలంగాణలో నేటి నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ..!

Saturday, June 5th, 2021, 09:00:08 AM IST

తెలంగాణలో కరోనా విపత్తు ప్యాకేజీ కింద నేటి నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక్కో వినియోగదారునికి 15 కిలోల చొప్పున ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 15 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు. సాధారణ రోజుల్లో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తుండగా ఈ నెలలో 15 కిలోల చొప్పున బియ్యాన్ని ఇస్తున్నారు.

అయితే ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద మే, జూన్‌ నెలల్లో ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వలన మే నెలలో కేంద్రమిచ్చే కోటా పంపిణీ చేయలేదు. దీంతో మే, జూన్‌ కోటా కింద కేంద్రం 10 కిలోలు, రాష్ట్రం కోటా 5 కిలోలు కలిపి ఒక్కొక్కరికి 15 కిలోలు ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు.