రాంచరణ్, బోయపాటి చిత్రం లో హీరోయిన్ గా ఆ ఇద్దరిలో ఎవరు?

Thursday, January 11th, 2018, 02:35:15 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కధానాయకుడిగా, డి వి వి దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే నూతన చిత్రంలో హీరోయిన్ ఎంపిక దాదాపుగా పూర్తికావచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు సరసన తొలిసారి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్నబాలీవుడ్ నటి కైరా అలీ అద్వానీ , లేటెస్టుగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లో సెకండ్ హీరోయిన్ గా నటించిన అను ఇమ్మానుయేల్ ల లో ఎవరో ఒకరిని తీసుకునే అవకాశం ఉందని, వీరిద్దరితోను సంప్రదింపులు జరుపుతున్నామని, అయితే కాల్ షీట్ల సర్దుబాటుని బట్టి ఫైనల్ గా ఎవరు హీరోయిన్ గా సెలెక్ట్ అవుతారో తెలుస్తుందని చిత్ర బృందం తెలిపింది.

ధ్రువతో మంచి విజయాన్ని అందుకున్న రాంచరణ్ , వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న బోయపాటి ల కలయికలో రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. హీరోలను పక్కా మాస్ లుక్ లో చూపించడం లో సిద్ధహస్తుడైన బోయపాటి ఈ చిత్రంలో తమ అభిమాన హీరోని ఎలా ప్రెజంట్ చేస్తాడో అని చరణ్ అభిమానులు ఉత్సాహం గా ఎదురుచూస్తున్నారు. రాంచరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం అనే చిత్రం లో నటిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.