ఇక పై జాతీయ మీడియాకి వెళ్తా : శ్రీ రెడ్డి

Monday, April 9th, 2018, 05:41:01 PM IST

కాస్టింగ్ కౌచ్ విషయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద రగడ జరుగుతోంది. ఇటీవల తనకు కాస్టింగ్ కౌచ్ విషయంలో వేధింపులు ఎదురయ్యాయని, అవకాశం కోసం టాలీవుడ్ కి వచ్చే తెలుగు అమ్మాయిలందిరికి ఇటువంటి పరిస్థితి ఎదురవవుతోందని హీరోయిన్ శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాను ఇదివరకు తనలానే ఈ విషయమై టాలీవుడ్ హీరోయిన్లు గాయత్రి గుప్తా, మాధవీలత వచ్చినప్పటికీ వారు శ్రీ రెడ్డి లా ముందుకు రాలేదు. అయితే తాను మాత్రం అలా కాదని, ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేది లేదని అంటున్నారు. అయితే ఈ సందర్భంగా ఆమె మొన్న ఫిలిం ఛాంబర్ ఎదుట చేసిన అర్ధ నగ్న ప్రదర్శన పెద్ద చర్చకు దారి తీసింది.

అయితే దీనిపై స్పందించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, శ్రీ రెడ్డి చేసిన అలా బహిరంగంగా అర్ధ నగ్న ప్రదర్శన చేయడం సరికాదని మా అధ్యక్షులు శివాజీరాజా అన్నారు. అలానే హీరో శ్రీకాంత్, సీనియర్ నరేష్, నటి హేమ వంటి పలువురు ఆమె తీరును తప్పు బట్టారు. అయితే శ్రీరెడ్డికి ఎప్పటికి మా సభ్యత్వం ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇదివరకు ఆమె సభ్యత్వం ఇస్తామని చెపితే ఆమె స్పందించలేదని, సభ్యత్వ రుసుము కూస చెల్లించలేదని నటులు బెనర్జీ అన్నారు. ఐతే మా స్పందన పై నేడు స్పందించిన శ్రీ రెడ్డి మాట్లాడుతూ, ఒక ఆడది ఈ విధంగా బట్టలు విప్పే పరిస్థితికి వచ్చిందంటే కనీసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి ఏ ఒక్కరు ఏమి జరిగింది అని అడగలేదని ఆమె వాపోయారు.

ఇది ఇక్కడితో ఆగదని తన తీరును తప్పుపట్టిన శ్రీకాంత్, శివాజీరాజా వాళ్లకు నచ్చిన తీరులో మాట్లాడుతున్నారని, నాలుగు కుటుంబాల మీదనే టాలీవుడ్ ఆధారపడుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే అన్నారు. ఇలాంటి వారు వారికి తొత్తులుగా ఉండి మాలాంటి తెలుగు వారిని తొక్కి పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగదని, తాను ఇకపై జాతీయ మీడియాకి వెళ్తా అని, తనను వేధింపులకు గురి చేసిన ప్రతిఒక్కరి వీడియో లు, ప్రూఫ్ ల తో సహా బయటపెడతాను అని ఆమె అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments