ప్రభుత్వ కీలక నిర్ణయం – ఇకనుండి స్కూళ్లలో ఎల్కేజీ, నర్సరీలు ఉండవు

Saturday, December 7th, 2019, 04:27:38 PM IST

ప్రస్తుతానికి మన ప్రైవేట్ పాఠశాలల్లో రెండున్నరేళ్లకు స్కూల్స్‌లో జాయిన్ చేసుకోవడం, వారికి ఆటలు, పాటల పేరుతొ ప్లే స్కూల్స్ నడిపించడంతో తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ పాఠశాలల వైపే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలంటూ మూడేళ్లకే పిల్లలతో కొత్త కొత్త సావాసాలు చేయిస్తున్నారు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం. దానికి తోడు ఎల్కేజీ, నర్సరీ పేరుతొ అక్షరాలు దిద్దిస్తూ, పిల్లలని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు. కాగా ఇకనుండి ప్రైవేట్ పాఠశాలలో అలాంటి ఇబ్బందులు ఉండకూడదని హర్యాన ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకనుండి ప్రవైట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు తీసేయాలని పలు ఆదేశాలు జారీ చేసింది.

కాగా అతి చిన్న వయసులోనే పిల్లలు ఇలా స్కూలు బాట పట్టి, కొన్ని రోజులకు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే పిల్లలందరూ కూడా మానసికంగా ఎదగడానికి తగిన సమయం కేటాయించాలని, కనీసం ఐదు సంవత్సరాల తరువాతే పిల్లలను పాఠశాలల్లో చేర్పించుకోవాలని ఆదేశాలు జారే చేసింది. ఒకవేళ ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.