ఇకపై శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సినిమాలు చేస్తాను : మహేష్ బాబు

Sunday, April 29th, 2018, 09:59:18 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో, డివివి దానయ్య నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను. బ్రహ్మోత్సవం, స్పైడర్ లతో కాస్త డీలా పడ్డ మహేష్ బాబు ఈ చిత్రంతో మరొక్క సారి కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారు. కాగా ఈ చిత్రం విజయవంతం అయినా సందర్భంగా ఇప్పటికే విజయవాడ, తిరుపతి లకు విజయ యాత్రలు చేసిన భరత్ అనే నేను టీం, నిన్న హైదరాబాద్ లో విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభలో చిత్రంలో నటించిన పలువురు నటీనటులు, సాంకేతిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమా తనకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. గతంలో కూడా శివ గారు ఇలానే నా కెరీర్ ప్లాప్స్ లో వున్నపుడు శ్రీమంతుడు ఇచ్చారు,

అలానే ప్రస్తుతం భరత్ అనే నేను ఇచ్చాయారు అన్నారు. ఏప్రిల్ 20న మా అమ్మ ఇందిరమ్మ గారి పుట్టిన రోజున విడుదలయిన ఈ సినిమా షేర్ లను అందరు ఈ సినిమా మే 31 నాన్న కృష్ణ గారి పుట్టిన రోజువరకు చెప్తో ఉండాలని ఆకాంక్షించారు. నాన్నగారి నన్ను కూడా ఫాన్స్ సూపర్ స్టార్ అంటుంటారని ఆ పేరుకి కొరటాల శివ గారు రెండు సార్లు గౌరవం నిలబెట్టారని అన్నారు. నా కెరీర్లో ఇంత పెద్ద విజయం అందించిన నా ఫాన్స్ కి నాన్నగారి ఫాన్స్ కి చాల పెద్ద థాంక్స్ అన్నారు. ఇలానే శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సినిమాలు చూస్తుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్నారు…..