ప‌వ‌న్ కేరాఫ్ పాల‌కొల్లు లేదా న‌ర‌సాపురం?

Saturday, November 5th, 2016, 04:25:27 PM IST

pawan-janasena-new
ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డి నుంచి పోటీ చేసే ఛాన్సుంది? ప‌్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. ప‌.గో జిల్లా ఏలూరులో ఓటు క‌న్ఫ‌మ్ చేసుకున్నాక‌.. అత‌డు ప్ర‌త్య‌క్షంగా బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైంది. ఆ మేర‌కు ఏపీలో చురుగ్గా పావులు క‌దుపుతున్నారు ప‌వ‌న్‌. అయితే ప‌వన్ ఏ నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేస్తారు? ప‌వ‌న్ సొంత ఊరు న‌ర‌సాపురం. అన్న‌య్య చిరంజీవి పోటీ చేసింది ఇక్క‌డి నుంచే. ఇక పాల‌కొల్లు అల్లు రామ‌లింగ‌య్య‌, అల్లు అర‌వింద్ స్వ‌స్థ‌లం. కాబ‌ట్టి ఈ రెండు చోట్లా త‌న‌కు బ‌లం ఉంది. పైగా పాల‌కొల్లు, న‌ర‌సాపురంలో కాపు సామాజిక వ‌ర్గానిదే పైచేయి కాబ‌ట్టి అది త‌న‌కి క‌లిసొస్తుంది. అన్న‌తో సంబంధం లేకుండా త‌న‌ని అభిమానించే బ‌ల‌మైన కాపు వ‌ర్గం అక్క‌డ ఉంది. అందుకే ప‌వ‌న్ దృష్టి ఆ రెండు చోట్లా ఉంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయ్‌.

అధికారిక స‌మాచారం ప్ర‌కారం.. పాల‌కొల్లు ఓట్లు 1.60 ల‌క్ష‌లు, న‌ర‌సాపురం ఓట్లు 1.20. ఇందులో మెజారిటీ పార్ట్ ఓట్లు కాపుల‌వే. అయితే ప‌వ‌న్ త‌క్కువ టైమ్‌లో బ‌రిలోకి దిగినా త‌క్కువ ఓట్లు ఉన్న చోట గెలుపు త‌థ్యం కాబ‌ట్టి .. న‌ర‌సాపురం నుంచే పోటీ చేసే ఛాన్సుంద‌ని విశ్లేషిస్తున్నారు. పాల‌కొల్లులో కాపుల‌తో పాటు బీసీలైన శెట్టి బ‌లిజ‌ల బ‌లం అధికంగా ఉంది. న‌ర‌సాపురంలో మాత్రం కాపుల‌దే అన్ని విధాలా పైచేయి. ఇదంతా ప‌వ‌న్‌కి క‌లిసొస్తుంది కాబ‌ట్టి అక్క‌డి నుంచే పోటీ చేసే ఛాన్సుంద‌ని చెబుతున్నారు.